దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆయన బహిరంగ కార్యక్రమాలకు తాత్కాలికంగా దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం బుధవారం వెల్లడించింది. 73 ఏళ్ల రామాఫోసా న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న అనంతరం సోమవారం ఇండియా నుంచి దక్షిణాఫ్రికా తిరిగి వెళ్లారు. ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లగానే ఆయన అనార్యోగం బారిన పడ్డారు. దక్షిణాఫ్రికా అధినేత ఎంత కాలం కార్యక్రమాలకు దూరంగా ఉంటారనే విషయాన్ని ఆయన కార్యాలయం వెల్లడించలేదు. దీంతో ఇప్పటికే నిర్ణయించిన బహిరంగ కార్యక్రమాల్లో వీలైనంత వరకు తన బదులు కేబినెట్ సహచరులు పాల్గొనాలని రామాఫాసో కోరారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే సైతం వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
'బ్రిక్స్' నుంచి తిరిగెళ్లాక దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి అనారోగ్యం !
Thursday, September 17, 2026
international Presidency announced this on Wednesday South African President Falls Ill After Returning from BRICS
No comments:
Post a Comment