దేశవ్యాప్తంగా అందుతున్న విషెష్‌పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తన 76వ పుట్టినరోజు సందర్భంగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ చేపట్టిన 'ఆశీర్వాద్ కా దియా' కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ప్రజల నుంచి అందుతున్న ఆశీర్వాదాలు దేశసేవ పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పుకొచ్చారు. మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని గాయని స్నేహా శంకర్, కళాకారుడు అమన్ పంత్ రూపొందించిన 'ఆశీర్వాద్ కా దియా' ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. మోడీ జన్మ దినంతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తుచేస్తూ ఈ పాటను అంకితం చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని.. తనకు లభిస్తున్న ప్రజల ఆశీర్వాదాలు దేశానికి సేవ చేయాలన్న తన నిబద్ధతను మరింత పెంచుతాయని పేర్కొన్నారు.
ప్రజల నుంచి అందుతున్న ఆశీర్వాదాలు దేశసేవ పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయి : ప్రధాని మోడీ
Thursday, September 17, 2026
Blessings from the people further strengthen my resolve to serve the nation national PM Modi Speaking about the 'Aashirwad Ka Diya' initiative launched by the BJP
No comments:
Post a Comment