లండన్ నుంచి ఢాకా వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు పరస్పరం గొడవకు దిగారు. మొదట మాటలతో మొదలైన వివాదం కాస్తా కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిపోర్టుల ప్రకారం, బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ముందుగా వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికే ఆ వివాదం భౌతిక దాడికి దారితీసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు బిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధ ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు మొదట వాగ్వాదానికి దిగడం, ఆ తర్వాత పరస్పరం కొట్టుకోవడం కనిపిస్తోంది. గొడవ సమయంలో ఒక ప్రయాణికుడి టీ-షర్ట్ చినిగిపోయినట్లు వీడియోలో కనిపించింది. పరిస్థితి అదుపు తప్పడంతో కేబిన్ సిబ్బంది, ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీసేందుకు ప్రయత్నించారు. చివరికి వారిని వేరు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) మహబూబుద్దీన్ అహ్మద్ స్పందించారు. తనకు ఈ ఘటనపై అప్పటివరకు పూర్తి సమాచారం లేదని, విషయం తెలుసుకుంటున్నానని తెలిపారు. అయితే గొడవకు అసలు కారణం ఏమిటి? ప్రయాణికులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారా? అనే వివరాలు వెంటనే వెల్లడికాలేదు.
ホーム
/
Video goes viral
/
బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు : వీడియో సోషల్ మీడియాలో వైరల్
Friday, September 18, 2026
international Passengers Brawl on Biman Bangladesh Airlines Flight traveling from London to Dhaka Video goes viral
No comments:
Post a Comment