తాతా మధును సభ్యత్వం రద్దు చేయడంతో పాటు బీఆర్ఎస్ నుండి కేసీఆర్ సస్పెండ్ చేయాలి : మంత్రి సీతక్క డిమాండ్

الاثنين، 7 سبتمبر 2026

KCR Expel Tata Madhu from BRS and Revoke His Membership Minister Seethakka Demand telangana using abusive language

t f B! P L

తెలంగాణ శాసనసభా స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వం రద్దు చేయడంతో పాటు ఆయన్ను బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ తక్షణమే బహిష్కరించాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ బయటకు రాకుండా బీఆర్ఎస్‌ఎల్పీ మీటింగ్ కూడా ఫాంహౌస్‌లోనే నిర్వహిస్తున్నారని వారిదంతా ఫామ్ హౌస్ రాజకీయం అని విమర్శించారు. రాజకీయ రాద్దాంతం తప్ప బీజేపీ, బీఆర్ఎస్‌లకు ప్రజా సమస్యలు పట్టవా అని నిలదీశారు. అవాళ మీడియాతో మాట్లాడిన సీతక్క.. అసెంబ్లీ అంటే చట్టాలు చేసే పవిత్ర దేవాలయం అని అలాంటి అసెంబ్లీకి రాకుండా బయట నిరసన ఎందుకు అని నిలదీశారు. సభ ప్రారంబం కాగానే బీజేపీ నిరసన దేనికి? సమస్యలపై చర్చిస్తామంటే నిరసన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షం తెలంగాణలొ లేదని సీతక్క విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు డ్రామా కంపెనీలుగా మారాయని, బీఆర్ఎస్ అసెంబ్లీ బయట, బీజేపీ అసెంబ్లీ లోపల డ్రామా చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. వారికి కేవలం రాజకీయం, ప్రచారం మాత్రమే కావాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో నియమాలు పెట్టి నియంతగా వ్యవహారించారని వారు పెట్టిన నిబంధనలను వారే తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ