అమెరికాలో ఎస్సార్ గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు : అధికారికంగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

الثلاثاء، 29 سبتمبر 2026

business Essar Group to Set Up Steel Plant in the US with Massive Investment international national Officially Announced by Donald Trump

t f B! P L

అమెరికాలో భారత్ కు చెందిన ప్రముఖ కంపెనీ ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడికి సిద్ధమైంది. అమెరికాలో ఏకంగా 18 బిలియన్ డాలర్లుపెట్టుబడి పెట్టాలని ప్రణాళిక వేసింది.  అయోవా రాష్ట్రంలో 15 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.1.4 లక్షల కోట్లు) భారీ వ్యయంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీస్లో రూయా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తున్న ఎస్సార్ అమెరికన్ అనుబంధ సంస్థ 'మెసాబి మెటాలిక్స్' అయోవాలో నిర్మించే ఈ ప్లాంట్, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా నిలవనుందని ట్రంప్ అన్నారు. 2030 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్లాంట్, పూర్తయిన తర్వాత ప్రతి ఏటా 10 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయనుంది. ఈ కర్మాగారానికి అవసరమైన ఇనుప ఖనిజాన్ని మిన్నెసోటాలోని కంపెనీ కార్యకలాపాల నుంచి నేరుగా సరఫరా చేస్తారు. దీనివల్ల యునైటెడ్ స్టేట్స్ లోనే పూర్తిస్థాయి ఉక్కు సరఫరా చైన్ ఏర్పాటవుతుంది. ఉక్కు దిగుమతులపై గతంలో తాను విధించిన 50 శాతం సుంకాల వల్లే అమెరికా ఉక్కు పరిశ్రమ వేగంగా పుంజుకుంటోందని ట్రంప్ అన్నారు. సుంకాలు చెల్లించకూడదనే ఉద్దేశంతోనే కంపెనీలు తమ ప్లాంట్లను నేరుగా అమెరికాలోనే నిర్మిస్తున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో తయారీ రంగానికి పెద్దపీట వేస్తున్నందుకు, ఈ అవకాశాన్ని కల్పించినందుకు మెసాబి మెటాలిక్స్ ఛైర్మన్ రేవంత్ రూయా ట్రంప్నకు కృతజ్ఞతలు తెలిపారు. మెసాబి మెటాలిక్స్ సీఈఓ జో బ్రోకింగ్ మాట్లాడుతూ..నేషనల్ సెక్యూరిటీ, ఆటోమొబైల్స్, నౌకా నిర్మాణం, మౌలిక సదుపాయాలకు అవసరమైన కీలకమైన ఉక్కు అవసరాలను ఈ ఫ్యాక్టరీ తీరుస్తుందని పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ