జార్ఖండ్‌లోని చత్రా జిల్లా లావాలౌంగ్ పోలీస్ స్టేషన్ పరిధి లుట్టూ సోహావన్ గ్రామానికి చెందిన బృజేశ్ సింగ్ గంజూ అలియాస్ గోపాల్ సింగ్ భోక్తా, దులార్‌చంద్ గంజూ, రంజన్, ఫుల్‌చంద్ గంజూ తదితర పేర్లతోనూ చలామణి అయ్యాడు. సీపీఐ (మావోయిస్టు)కి వ్యతిరేకంగా సమాంతర సంస్థను ఏర్పాటు చేశాడు. అదే తర్వాత టీఎస్‌పీసీగా విస్తరించింది. చత్రాతోపాటు రాంచీ, హజారీబాగ్, రామ్‌గఢ్, పలామూ, లాతేహార్ జిల్లాలతో పాటు బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో టీఎస్‌పీసీ కార్యకలాపాలు పెరిగాయి. మావోయిస్టులతో ఆధిపత్యం కోసం రెండు దశాబ్దాలపాటు ఘర్షణలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మావోయిస్టులతోపాటు పలువురు గ్రామీణులు, ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. టీఎస్‌పీసీకి నాయకత్వం వహిస్తున్న సమయంలోనే బృజేశ్ గంజూ రాజకీయంగానూ గ్రామస్థాయిలో గుర్తింపు పొందాడు. 2010లో లావాలౌంగ్ పంచాయతీకి ఏకగ్రీవంగా ముఖియాగా ఎన్నికయ్యాడు. అయితే ఆ తర్వాత కూడా అతడి పేరు మావోయిస్టుల జాబితాలో చేరింది. భద్రతా బలగాల నిఘా పెరగడంతో చాలాకాలంగా పరారీలో ఉన్నాడు. బృజేశ్ గంజూపై జార్ఖండ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో రూ.5 లక్షల రివార్డు పెట్టింది. దీంతో అతడిపై మొత్తం రూ.30 లక్షల రివార్డు ఉంది. బనారస్‌లోని రామనగర్ ప్రాంతంలోని టెంగ్రా మోడ్ లంకా మైదానంలో ఆదివారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఝార్ఖండ్ పోలీసులు తెలిపారు. బైక్‌పై బృజేశ్ గంజూ వెళ్తున్న సమాచారంతో యూపీ ఏటీఎస్ అక్కడ మోహరించింది. ఉదయం సుమారు 5 గంటలకు అతడిని అడ్డుకోగా, కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిగా ఏటీఎస్ జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనలో ఏటీఎస్ డీఎస్పీ విపిన్ రాయ్, హవల్దార్ నితేంద్ర కృష్ణ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లకు కూడా తూటాలు తగిలాయి. ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయపడ్డారు.
మోస్ట్ వాంటెడ్ బృజేశ్ గంజూ ఎన్ కౌంటర్
Sunday, September 20, 2026
Chatra district Encounter of Most Wanted Brijesh Ganjhu Luttu Sohavan village under the Lawalong police station limits in Jharkhand
No comments:
Post a Comment