తెలంగాణ జానపద కళాకారుల సేవల వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళాకారుల నైపుణ్యాలు పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పర్యాటక కేంద్రాల్లో వేదికలు ఏర్పాటు చేసి కళాకారులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకలకు బదులిచ్చిన మంత్రి.. పర్యాటకులకు వినోదం కల్పించేందుకు కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. సాంస్కృతిక శాఖ ద్వారా సీఎం చేతుల మీదుగా ప్రభాత భేరీ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. 8500 మంది కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని కళాకారులకు రూ.3500 చొప్పున పింఛన్ ఇస్తున్నామన్నారు. గద్దర్ ఫౌండేషన్ కింద రూ. 3 కోట్లు కేటాయించామని వృద్ధ కళాకారులకు ప్రతి నెల పింఛన్లు ఇస్తున్నామన్నారు. పద్మశ్రీ గ్రహితలకు రూ. 25 లక్షల చొప్పున ఇచ్చామన్నారు. గంజాయి, మద్యం పారద్రోలేందుకు కళాకారుల ద్వారా ప్రదర్శనలు ఇప్పించి సమాజంలో అసమానతలపై చైతన్యపరుస్తామన్నారు.
జానపద కళాకారుల సేవలను వినియోగించుకునే యోచనలో తెలంగాణ ప్రభుత్వం
السبت، 12 سبتمبر 2026
Minister Jupally Krishna Rao plans to provide them with employment opportunities telangana Telangana Government Plans to Utilize Services of Folk Artists
ليست هناك تعليقات:
إرسال تعليق