నేపాల్‌లో ఇటీవల సంభవించిన జలవిలయంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తీవ్ర విషాదం మరియు శోకసంద్రంలో మునిగిన నేపాల్‌లో రెస్క్యూ టీమ్‌ల శ్రమ ఫలితంగా అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. వరదలు వచ్చి పది రోజులు గడిచినప్పటికీ, ఘోరమైన పరిస్థితుల మధ్య కొందరు సజీవంగా బయటపడటం ఆశలు చిగురింపజేస్తోంది. విపత్తు సంభవించిన పది రోజుల తర్వాత త్రిశూలీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుండి ఒక చైనా పౌరుడిని నేపాల్ సైన్యం సురక్షితంగా వెలికితీసింది. తీవ్రమైన నీరసం, గాయాలతో ఉన్న అతడిని మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే రాజధాని కాట్మాండుకు హెలికాప్టర్ ద్వారా తరలించారు. వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల్లో దాదాపు 900 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వారందరినీ కాపాడేందుకు భారతీయ మరియు నేపాలీ రెస్క్యూ బృందాలు సంయుక్తంగా శ్రమిస్తున్నాయి.
సొరంగం నుండి చైనా పౌరుడిని సురక్షితంగా వెలికితీసిన నేపాల్ సైన్యం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق