బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్‌లో 1500 మీటర్ల రేసులో ఒలింపిక్ విజేత, నార్వే రన్నర్ జాకబ్ నాలుగో స్థానంలో నిలిచాడు. చివరి వరకూ అగ్రస్థానంలో కొనసాగిన అతను లైన్‌కు చేరువగా వస్తున్న సమయంలో ఒక్కసారిగా వెనుకబడ్డాడు. కనీసం టాప్-3 ప్లేస్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఆస్ట్రేలియా అథ్లెట్ మేయర్స్ కామెరూన్ (3 నిమిషాల 30.14 సెకన్లు), కెన్యాకు చెందిన కోయిచ్ ఫన్యూయెల్ (3 నిమిషాల 30 .50 సెకన్లు), అమెరికా అథ్లెట్ స్ట్రాండ్ ఇథన్ (3:30.50)టాప్-3 ప్లేస్‌లో నిలిచారు. రేసు ముగిసిన తర్వాత జాకబ్ మాట్లాడుతూ  తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చివరి 30 మీటర్లు వచ్చేసరికి ప్రత్యర్థులు ఒక్కసారిగా తనకు అడ్డుగా పరుగెత్తినట్లు అతను ఆరోపించాడు. 'నా ప్రత్యర్థులంతా పిరికపందలు. వారంతా ఓ క్యూ లైన్ మాదిరిగా పరుగెత్తాలని వ్యూహం రచించారు. ఒకరి వెనుక ఒకరు దాక్కున్నారు. చివర్లో నా ముందు ఉన్న రన్నర్ సరిగ్గా పరుగెత్తకపోవడంతో నా లైన్ తప్పిపోవాల్సి వచ్చింది. నేను అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాలని అనుకోలేదు. కానీ చివరకు తప్పలేదు. ఇదంతా ప్రత్యర్థుల పన్నాగమే. తన సొంత టీమ్‌మేట్ కోసం వారు అలా చేశారు. ఈ రేసు ఫలితంతో చాలా నిరాశకు గురయ్యాను. కొంతమంది పిరికివాళ్లతో పోటీ పడ్డా. అగ్రస్థానంలో నిలిచిన కామెరూన్ మాత్రమే మంచి రేసర్‌లా కనిపించాడు. మిగతవారంతా ఓడిపోయినవారే.'అని జాకబ్ చెప్పుకొచ్చాడు.

Post a Comment

أحدث أقدم