పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్‌ను లాహోర్ లో ని ఆమె నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ పార్టీ తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శనకు ముందు ఈ అరెస్ట్ జరగడం గమనార్హం. ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ విడుదలే ప్రధాన డిమాండ్‌గా పీటీఐ పిలుపునిచ్చిన సెప్టెంబర్ 27 నిరసన కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్న వేళ పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. అలీమా ఖాన్ అరెస్టుకు ముందే నిరసనలకు సిద్ధమవుతున్న నలుగురు పీటీఐ నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇస్లామాబాద్ పోలీసు యంత్రాంగం, రాజధాని పరిపాలనా అధికారులు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఇస్లామాబాద్‌లోని సెంట్రల్ పోలీస్ ఆఫీస్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రణాళికలను ఆమోదించారు. నిరసనకారుల కదలికలు, పీటీఐ నాయకులు, శ్రేణుల కార్యకలాపాలపై నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్, స్పెషల్ బ్రాంచ్ సహా ప్రధాన నిఘా విభాగాలను అధికారులు హై అలర్ట్‌లో ఉంచారు.
ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ అరెస్ట్
Sunday, September 20, 2026
arrest occurred ahead of a massive protest demonstration organized by the PTI party demanding Imran Khan's immediate release Imran Khan's Sister Aleema Khan Arrested international pakistan
No comments:
Post a Comment