వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. పెంచిన రేట్లు ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 9.50 పైసల మేర పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై ఎలాంటి అదనపు భారం పడలేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు ఇచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా ధరల వివరాల ప్రకారం, ఈ పెంపు వాణిజ్య పరమైన ఎల్‌పీజీ వినియోగానికి మాత్రమే పరిమితమైంది. అయిదు కిలోల నాన్-డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. నిన్నటివరకు 762 రూపాయలు ఉన్న అయిదు కిలోల నాన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ ధర ఇప్పుడు 764 రూపాయలకు చేరుకుంది. అయిదు కిలోల డొమెస్టిక్ సిలిండర్లు, ఎక్స్‌ట్రాలైట్ గ్యాస్ ధరల జోలికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెళ్లలేదు. ఈ పెంపుతో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,738 నుంచి రూ. 2,747.50కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ సిలిండర్ ధర రూ. 2,691.50 నుంచి రూ. 2,701కు పెరిగింది. చెన్నైలో దీని ధర రూ. 10.50 పైసల మేర పెరిగింది. ఇక్కడ వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,916.50కు చేరుకుంది.
వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెంపు
الثلاثاء، 1 سبتمبر 2026
business Commercial LPG Cylinder Prices Hiked national no additional burden on LPG cooking gas cylinders used for domestic purposes revised rates came into effect at 6 AM today
ليست هناك تعليقات:
إرسال تعليق