మరో రెండు వారాల్లో 'జైలర్ 2'తో థియేటర్లలోకి రాబోతున్న రజనీకాంత్ ప్రస్తుతం 'ధర్మన్' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మైసూరులో జరుగుతోంది. అయితే ఇప్పటివరకు రూమర్స్‌గానే ఉన్న ఓ విషయాన్ని ఇందులో నటిస్తున్న రాశీఖన్నా బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'ధర్మన్' షూటింగ్ మైసూరులో జరుగుతుండటంతో అక్కడి దోశ, షూటింగ్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసిన రాశీఖన్నా, తెలుగు హీరో రామ్ ఈ మూవీలో నటిస్తున్నాడనే సంగతి రివీల్ చేసింది. గతంలో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు రాశీ, రజనీ-రామ్‌తో కలిసున్న ఫొటో పోస్ట్ చేయడంతో ఇది నిజమేనని క్లారిటీ వచ్చింది. ఇందులో రజనీకాంత్ కూతురిగా రాశీఖన్నా నటిస్తుండగా.. ఈమెకు ప్రియుడిగా నెగిటివ్ టచ్ ఉన్న విలనీ తరహా పాత్రలో రామ్ కనిపించబోతున్నాడట. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' తీసిన అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో దీన్ని రెడీ చేస్తున్నారు.
'ధర్మన్'లో హీరో రామ్ : రజనీ-రామ్‌తో కలిసున్న ఫొటో పోస్ట్ చేసిన రాశీఖన్నా
الثلاثاء، 29 سبتمبر 2026
cinema Hero Ram in 'Dharman' photo she shared regarding this is now going viral Raashii Khanna shares a photo with Rajini and Ram tamilnadu
ليست هناك تعليقات:
إرسال تعليق