మంత్రి పొంగులేటి ఆస్తులపై తక్షణమే విచారణ జరపాలి :ఈడీ కార్యాలయ ముట్టడించిన బీఆర్‌ఎస్
الاثنين، 28 سبتمبر 2026
BRS Protests at ED Office Demands Immediate Probe into Minister Ponguleti's Assets MLA Sanjay Kumar MLC Naveen Shambipur Raju telangana
హైదరాబాద్ లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆస్తులపై ఈడీ తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. గతంలో ఈడీ సోదాలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని వారు తీవ్రస్థాయిలో నిలదీశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజుతో పాటు పలువురు ముఖ్య బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. గతంలో సోదాలు జరిపిన అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనం వహించారని, తక్షణమే తదుపరి చర్యలు ఎందుకు చేపట్టడం లేదని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. నిరసనలో భాగంగా బీఆర్‌ఎస్ నేతలు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, లోపలికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈడీ కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ليست هناك تعليقات:
إرسال تعليق