ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి అత్యాధునిక స్టేడియంలో ఉమెన్ ఏపీఎల్ సీజన్-1 టోర్నమెంట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో పాల్గొన్న నారా బ్రాహ్మణి ఉమెన్ ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా క్రీడాకారిణులకు ఇదొక అద్భుతమైన వేదిక అని ప్రశంసించారు. ప్రతిభ ఉండి సరైన అవకాశాలు లభించని యువతకు ఈ టోర్నమెంట్ చక్కటి భవిష్యత్తును ఇస్తుందని, దక్కిన ప్రతి అవకాశాన్ని క్రీడాకారిణులు నమ్మకంతో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల మహిళలకు ఈ వేదిక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అట్టహాస వేడుకలో విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు తదితరులు పాల్గొన్నారు. సినీ నటి స్నిగ్ధ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ గాయకులు హేమచంద్ర, గీతా మాధురి తమ మధురమైన పాటలతో మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలతో స్టేడియం మొత్తం కోలాహలంగా మారింది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఉమెన్ ఆంధ్ర ప్రిమియర్ లీగ్ సీజన్-1 తొలి మ్యాచ్‌లో అమరావతి ఈగల్ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్‌బర్డ్స్ జట్లు తలపడ్డాయి.
ఉమెన్ ఏపీఎల్ ప్రారంభం : ట్రోఫీని ఆవిష్కరించిన నారా బ్రాహ్మణి
السبت، 19 سبتمبر 2026
Andhra Pradesh Nara Brahmani Unveils the Trophy Season 1 of the Women's Andhra Premier League officially commenced sports state-of-the-art stadium in Mangalagiri Women's APL Kick-off
ليست هناك تعليقات:
إرسال تعليق