ホーム
/
west bengal
/
టీఎంసీ కునాల్ ఘోష్ పై రాళ్ల దాడి : వీడియో నెట్టింట వైరల్
السبت، 26 سبتمبر 2026
he was en route to a public meeting in Serampore Hooghly district Stone-pelting attack on TMC's Kunal Ghosh Uttarpara Video goes viral west bengal
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా ఉత్తరపారాలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ శ్రీరామ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు వెళుతుండగా కారుపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది బీజేపీ గూండాల పని అని కునాల్ ఆరోపించారు. కొందరు వ్యక్తులు ఘోష్ వాహనాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కొందరు కారును కొట్టి, గుడ్లు విసిరారు, వెనుక విండ్‌షీల్డ్‌ను పగలగొట్టారు. దీంతో ఘోష్ కోల్‌కతాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కర్రలు, రాడ్లు, నల్లటి పోస్టర్లతో వచ్చిన ఒక గుంపు తన కారును అడ్డగించి, రాళ్లు, గుడ్లతో దాడి చేసిందని కునాల్ ఘోష్ ఆరోపించారు. ఈ దాడిలో కారు ముందు, వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. సంఘటనా స్థలంలో ఒక్క పోలీసు కూడా లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
ليست هناك تعليقات:
إرسال تعليق