ホーム
/
technology
/
ఆపిల్ లో రెండు నెలల వ్యవధిలో మళ్లీ ఉద్యోగాల కోత
Tuesday, September 22, 2026
Apple Implements Another Round of Job Cuts Within Two Months Bloomberg report company's 'Fitness+' subscription division. Specifically technology
ఆపిల్ సంస్థలో రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ఉద్యోగ కోతలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదికను ఉటంకిస్తూ ఇండియా టుడే ప్రచురించిన వివరాల ప్రకారం ఈ తాజా లేఆఫ్స్ రౌండ్‌లో కంపెనీకి చెందిన ‘ఫిట్‌నెస్+’ సబ్‌స్క్రిప్షన్ విభాగంలో పనిచేస్తున్న కొద్దిమంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడింది. ముఖ్యంగా ఆపిల్ వాచ్ వినియోగదారులకు మార్గనిర్దేశంతో కూడిన ఆడియో వర్కౌట్‌లను అందించే ‘టైమ్ టు వాక్’, ‘టైమ్ టు రన్’వంటి ఆడియో ఫీచర్లపై పనిచేస్తున్న బృందాల ఉద్యోగులను ఈ లేఆఫ్స్ ప్రభావితం చేశాయి. ఈ కోతల కారణంగా రాబోయే రోజుల్లో ఆపిల్ ఫిట్‌నెస్+ సేవల ద్వారా విడుదలయ్యే కొత్త ఆడియో కంటెంట్ వేగం లేదా తరచుదనం తగ్గే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ ఫిట్‌నెస్+ డిజిటల్ సేవలను పూర్తిగా నిలిపివేసే ఆలోచన లేదని కంపెనీ స్పష్టం చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సేవలైన ఫిట్‌నెస్+ లో నిరంతరం కొత్త డిజిటల్ కంటెంట్ రూపొందించడానికి అధికంగా ఖర్చు అవుతుండటం.. చందాదారుల సంఖ్యలో ఎదురవుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఆపిల్ తన ఖర్చులను పునఃసమీక్షించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఫిట్‌నెస్+ సేవలను ఆపిల్ హెల్త్ యాప్‌తో మరింత పటిష్టంగా అనుసంధానించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా, గత ఆగస్టు నెలలోనే ఆపిల్ తన ‘ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ఎక్స్‌పీరియన్స్’ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విభాగంలో ఏకంగా 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment