ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం : మద్దతు ప్రకటించిన విసెగ్రాడ్ గ్రూప్ దేశాలు

الثلاثاء، 22 سبتمبر 2026

Bid for Permanent UN Security Council Membership Czech Republic Hungary international national Poland Slovakia Visegrád Group Nations Support India

t f B! P L

క్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మధ్య ఐరోపాకు చెందిన విసెగ్రాడ్ గ్రూప్ (వీ4) దేశాలు మద్దతు ప్రకటించాయి. పోలాండ్, హంగరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన ఈ తొలి 'వీ4' భారత్‌ భేటీలో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, రక్షణ, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించారు. భారత్-విసెగ్రాడ్ గ్రూప్ మధ్య రాజకీయ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఐదు దేశాల విదేశాంగ మంత్రులు ఏటా సమావేశం కానున్నారు. అలాగే ఆర్థిక సహకారాన్ని పెంచేందుకు వార్షిక బిజినెస్ ఫోరమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జైశంకర్ తెలిపారు. ఈ భేటీని ఆయన కొత్త చారిత్రక సందర్భంగా అభివర్ణించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు, పరిశోధన, విద్య, అంతరిక్షం, కనెక్టివిటీ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని భారత్, వీ4 దేశాలు నిర్ణయించాయి. సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య రాకపోకలను కూడా మరింత అభివృద్ధి చేయాలని అంగీకరించాయి. రక్షణ రంగంలో ఇప్పటికే ఉన్న సహకారాన్ని పునరుద్ధరించి మరింత ముందుకు తీసుకెళ్లాలని జైశంకర్ పేర్కొన్నారు. స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశంగా, ఇండో-పసిఫిక్‌లో ఎదుగుతున్న శక్తిగా ఉన్న భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉండాలని వీ4 దేశాలు అంగీకరిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం యూఎన్‌ఎస్‌సీలో చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా ఐదు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. వీటికి వీటో అధికారం ఉంది. భద్రతా మండలి నిర్మాణాన్ని ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని భారత్ చాలాకాలంగా కోరుతోంది. అయితే శాశ్వత సభ్యత్వం కోసం వీ4 మద్దతు లభించడం ఒక దౌత్యపరమైన మద్దతు అయినప్పటికీ, వీఎన్‌ఎస్‌సీ సంస్కరణకు విస్తృత అంతర్జాతీయ చర్చలు, సభ్యదేశాల అంగీకారం అవసరం. ఈ సమావేశంలో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారంతో పాటు ఉక్రెయిన్ వివాదం, గల్ఫ్ ప్రాంత పరిణామాలు వంటి అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, బహుపాక్షిక సహకారం వంటి అంశాలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నారు. విసెగ్రాడ్ గ్రూప్‌లో పోలాండ్, హంగరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ ఉన్నాయి. మధ్య ఐరోపాకు చెందిన ఈ నాలుగు దేశాలు రాజకీయ, ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక, ఇంధన రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ