ఆసియా క్రీడలు 2026 : మహిళల టీ20 క్రికెట్ పోటీల్లో పాకిస్తాన్ కి కాంస్యం

الثلاثاء، 22 سبتمبر 2026

2026 Asian Games defeating Bangladesh by 31 runs Pakistan Wins Bronze in Women's T20 Cricket first time in nearly 12 years of Asian Games history sports

t f B! P L

గోయా వేదికగా జరిగిన మహిళల టీ20 క్రికెట్ పోటీల్లో మూడో స్థానం పోరులో బంగ్లాదేశ్‌ను 31 పరుగుల తేడాతో చిత్తు చేసి పాకిస్తాన్ మహిళల జట్టు కాంస్య పతకాన్ని సాధించారు.  ఆసియా క్రీడల చరిత్రలో దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు పతక పీఠాన్ని అధిరోహించడం విశేషం. సెమీఫైనల్స్‌లో శ్రీలంక చేతిలో పాకిస్తాన్, భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి పాలై కాంస్య పతకం కోసం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టుకు ఆరంభంలో తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి. 12 ఓవర్లు ముగిసేసరికి కేవలం 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పాక్ తీవ్ర కష్టాల్లో పడింది. అయితే ఆ సమయంలో కెప్టెన్ ఫాతిమా సనా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. కేవలం 30 బంతుల్లోనే 45 పరుగులు చేసి వేగంగా స్కోరు బోర్డును పరిగెత్తించింది. ఆమెతో పాటు గుల్ ఫిరోజా(31), ఆలియా రియాజ్(25) కీలక పరుగులు జోడించడంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా అక్తర్, షోర్నా అక్తర్, రితు మోని తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 20 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఆ తర్వాత ఎక్కడా తేరుకోలేకపోయింది. కెప్టెన్ నిగర్ సుల్తానా(25), షర్మిన్ అక్తర్(46) కొంతసేపు పోరాడినప్పటికీ.. రన్ రేట్ ఒత్తిడి పెరిగిపోవడంతో క్రమంగా వికెట్లు పారేసుకుంది. పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ఉమ్-ఎ-హాని అద్భుత బౌలింగ్ స్పెల్‌తో బంగ్లాదేశ్ మిడిలార్డర్ నడుం విరిచింది. కేవలం 10 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులకే పరిమితమైంది. ఈ ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో విజయ సాధించి కాంస్య పతకాన్ని ముద్దాడింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ