పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. రెజీనగర్‌లో మమతా బెనర్జీ వర్గం అనూహ్యంగా ఎంపిక చేసిన వ్యక్తి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ. ఆయనకు నియోజకవర్గంతో గట్టి రాజకీయ అనుబంధమే ఉంది. ఇక్కడి నుంచే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2013లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా రెజీనగర్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2016లోనూ కాంగ్రెస్ తరఫున అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి 2021లో టీఎంసీ అభ్యర్థిగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఆయనను రెజీనగర్ నుంచి కాకుండా బెల్డంగా నియోజకవర్గం నుంచి బరిలోకి దించింది. అక్కడ ఆయన ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఉప ఎన్నికలో మళ్లీ తన పాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న పరిచయం, గత రాజకీయ అనుభవం ఆయనకు కలిసొస్తాయని దీదీ భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఇప్పుడు తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంటూ పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలు : రెజీనగర్ నుంచి తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి రబీ ఉల్ ఆలమ్ చౌద్రీ
السبت، 19 سبتمبر 2026
He has won as an MLA from this constituency three times national TMC Candidate Rabiul Alam Chowdhury Withdraws from Rejinagar west bengal West Bengal By-elections
ليست هناك تعليقات:
إرسال تعليق