అక్రమ క్లినిక్‌లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడి : హయత్‌నగర్‌లో అజయ్ క్లినిక్ సీజ్
الاثنين، 21 سبتمبر 2026
'Ajay Clinic' in Hayathnagar Sealed Medical and Health Department Officials Raid Illegal Clinics Ranga Reddy District telangana
తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశాల మేరకు అక్రమ క్లినిక్‌లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా హయత్‌నగర్‌లోని అజయ్ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. డెమో గంగాసాని మంజుల, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సత్యరత్న, మెడికల్ ఆఫీసర్ డా. ప్రియాంక, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కలిసి క్లినిక్‌ను తనిఖీ చేశారు. క్లినిక్ డా. సరిత పేరుతో రిజిస్టర్ అయి ఉండగా, రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే డాక్టర్ అందుబాటులో లేని సమయంలో అర్హత లేని వ్యక్తి వైద్యం చేస్తున్నట్లు గుర్తించడంతో క్లినిక్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వర్ణకుమారి హెచ్చరించారు.
ليست هناك تعليقات:
إرسال تعليق