నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల : జిల్లాల కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

الاثنين، 21 سبتمبر 2026

000 crore to be released for irrigation projects Funds up to ₹6 Minister Uttam Kumar Reddy at video conference with District Collectors telangana

t f B! P L

తెలంగాణ లోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం-పునరావాస పునరుద్ధరణ పనుల పురోగతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనులకు అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. 2026-27ఆర్థిక సంవత్సరంలో భూసేకరణకు మొత్తం రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.1,050కోట్లు, మరోసారి రూ.1,500కోట్లు కలిపి మొత్తం రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం రూ.2,550 కోట్లు విడుదలైన నిధుల్లో అధిక భాగం ఇప్పటికీ అధికారుల ఖాతాల్లోనే ఉండి, లబ్ధిదారులకు చేరకపోవడం ఆందోళనకరమని అన్నారు. జిల్లా కలెక్టర్లు భూసేకరణ లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.నిధులు సరిపోకపోయినా, ఇతర కారణాల వల్ల చెల్లింపులు సాధ్యం కాకపోయినా ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. విడుదలైన నిధులను అధికారుల వద్ద ఉంచి పనులను పెండింగ్‌లో పెట్టవద్దని స్పష్టం చేశారు. భూసేకరణ పనులకు ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు అప్పగించాలని, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని పనులను పూర్తి చేయాలని మంత్రి సూచించారు.నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు రెవెన్యూ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పురోగతిని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇప్పటికే విడుదలైన రూ.2,550 కోట్లను పూర్తిగా వినియోగించిన అనంతరం అవసరాన్ని బట్టి అదనపు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూసేకరణ ప్రక్రియలో రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు రైతులతో నేరుగా చర్చించి స్నేహపూర్వక వాతావరణంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ నిబంధనల ప్రకారం జరగాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పరిహారం మార్కెట్ విలువకు సాధ్యమైనంత సమీపంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి బడ్జెట్‌కు అదనంగా ఇతర వనరుల నుంచి నిధులు సమకూర్చి మంజూరు చేస్తున్నందున అధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని భూసేకరణ పనులను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ