జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అయితే కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో మాత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతూ బెండమూర్లంకు చెందిన బీటెక్ విద్యార్థి రోళ్ల ప్రేమ్ కుమార్ విద్యుత్ ఘాతానికి గురైయ్యారు. ప్రేమ్ కుమార్ తో పాటు మరికొంతమందికి కూడా కరెంట్ షాక్ కొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రేమ్ కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రేమ్ కుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు : ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ఘాతానికి గురై ఒకరి మృతి
الأربعاء، 2 سبتمبر 2026
Andhra Pradesh Konaseema district Odalarevu in Allavaram Mandal One Dies of Electrocution While Putting Up Banner Pawan Kalyan's Birthday Celebrations
ليست هناك تعليقات:
إرسال تعليق