లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యాశాఖ అధికారి

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ విద్యాశాఖ అధికారి గోవింద రాం రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీని ఇన్స్పెక్షన్ చేసి, అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడానికి అధికారి గోవింద రాం రూ. 50,000/- డిమాండ్ చేశారు. గత వారం లోనే రూ.30, 000/- ఇవ్వగా, మిగతా రూ. 20, 000/- కోసం ఫోన్ చేసి అడగడంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. కార్యాలయంలో 20, 000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0 Comments