ఆండ్రాయిడ్ పరికరాన్ని ఆర్డర్ చేస్తే పేడ పొడి వచ్చింది !

గ్రేటర్ నోయిడాలో ఆజాద్ అనే యువకుడు తన అవసరం కోసం ఆన్‌లైన్ ద్వారా ఓ ఆండ్రాయిడ్ పరికరాన్ని ఆర్డర్ చేశాడు. ఆ పరికరానికి సంబంధించిన పూర్తి మొత్తాన్ని ముందుగానే ఆన్‌లైన్‌లో చెల్లించాడు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన కొరియర్ పార్సిల్‌ను విప్పి చూసిన అతనికి దిమ్మతిరిగింది. ఆండ్రాయిడ్ పరికరానికి బదులుగా, ఆ పార్సిల్ నిండా పేడ నింపి ఉండటాన్ని చూసి అతను కంగుతిన్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పాటు, ఈ మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సదరు యువకుడు షాపింగ్ చేసిన వెబ్‌సైట్, పేమెంట్ వివరాలు, డెలివరీ ప్రక్రియ తదితర కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 

Post a Comment

0 Comments