యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలైన రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. సీఐ సుబ్బరాజు వెల్లడించిన వివరాల ప్రకారం అద్దంకి మండలం పేరాయపాలేనికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాసరావు తన కోడలికి యూకేలో ఉద్యోగం కోసం 2023లో గుంటూరులో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రమానందన మామ జె.మోహనరావును సంప్రదించారు. తొలి విడతగా అడ్వాన్స్ రూపంలో రూ.లక్ష చెల్లించగా.. పత్రాలన్నీ పూర్తయ్యాక మరో రూ.9.60 లక్షలు అందజేశారు. అయితే ఎంత కాలం గడిచినా ఉద్యోగం రాకపోగా, అడిగిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు ఈ ఏడాది జూన్‌లో అద్దంకి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కన్సల్టెన్సీ నిర్వాహకులు జె.మోహనరావు, భార్య ఝాన్సీలక్ష్మి, కుమారుడు మధుకర్, కోడలు రమానందనతో పాటు ఆమె తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం యూకే పౌరసత్వం కలిగి ఉన్న రమానందన బిగ్‌బాస్ షో ఎంపికల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయగా, శుక్రవారం ఆమె తన న్యాయవాదితో కలిసి అద్దంకి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నోటీసులు అందుకున్నట్లు సీఐ తెలిపారు.
యూట్యూబర్ రమానందనపై మరో కేసు నమోదు
السبت، 12 سبتمبر 2026
Addanki police served notices Andhra Pradesh Another Case Registered Against YouTuber Ramanandana crime details provided by CI Subbaraju
ليست هناك تعليقات:
إرسال تعليق