ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ భేటీకి రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. ఒక్కో ఉద్యోగ సంఘం నుంచి ఒక ప్రతినిధి సమావేశానికి హాజరయ్యేలా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిలు, ఇతర ఆర్థికపరమైన అంశాలను ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై కూడా సీఎం చంద్రబాబు సంఘాల నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అమరావతి ఐకాస ఆధ్వర్యంలో గత నెల 29 నుంచి ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపు సహా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే పలు దశల్లో ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేసిన ఉద్యోగ సంఘాలు సమస్యలపై స్పష్టమైన హామీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో జరగనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యోగ సంఘాల నేతలు తమ ప్రధాన డిమాండ్లను సీఎం ముందు నేరుగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం, పెండింగ్‌లో ఉన్న డీఏల చెల్లింపు, వివిధ బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం అనుసరించే విధానంపై ఉద్యోగ సంఘాలు స్పష్టత కోరనున్నాయి.
రేపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
الجمعة، 4 سبتمبر 2026
Andhra Pradesh CM Chandrababu to Meet Employee Union Representatives Tomorrow invitations were sent with the stipulation that one representative from each union attend
ليست هناك تعليقات:
إرسال تعليق