} గుజరాత్‌లో సహకార సంఘాల ఎన్నికలు : కాంగ్రెస్ మద్దతు ఉన్న 'కిసాన్ పరివర్తన్ ప్యానెల్' ఘనవిజయం -LATEST NEWS AP TO TG

గుజరాత్‌లో సహకార సంఘాల ఎన్నికలు : కాంగ్రెస్ మద్దతు ఉన్న 'కిసాన్ పరివర్తన్ ప్యానెల్' ఘనవిజయం

الجمعة، 18 سبتمبر 2026

Congress-backed 'Kisan Parivartan Panel' Scores a Resounding Victory Cooperative Society Elections in Gujarat national

t f B! P L

గుజరాత్‌లోని గ్రామీణ రాజకీయాల్లో అత్యంత బలమైనవిగా భావించే సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చాయి. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల తరహాలోనే వీటిని ప్రతిష్టాత్మకంగా భావించి పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతాయి. అలాంటి సహకార రంగ పోరులో, కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండు ప్రతిష్టాత్మక స్థానాలను బీజేపీ మద్దతున్న ప్యానెళ్లు కోల్పోవడం సంచలనం రేపుతోంది. ముఖ్యంగా సంప్రదాయబద్ధంగా బీజేపీకి పట్టున్న ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్న ప్యానెళ్లు ఊహించని రీతిలో ఘన విజయం సాధించాయి. దక్షిణ గుజరాత్‌లోని బార్డోలి చక్కెర సహకార సంఘం రూపంలో తొలి దెబ్బ తగిలింది. 1955లో ప్రారంభమైన 'శ్రీ ఖేదత్ సహకారీ ఖాండ్ ఉద్యోగ్ మండలి' ఆసియాలోనే అతిపెద్ద చక్కెర సహకార సంఘంగా గుర్తింపు పొందింది. దాదాపు 5,684 మంది రైతు సభ్యులతోపాటు సొంతంగా 21 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ద్వారా ఏటా రూ.20 కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని ఆర్జించే ఈ కీలక సంస్థపై కాంగ్రెస్ మద్దతు ఉన్న 'కిసాన్ పరివర్తన్ ప్యానెల్' ఘనవిజయం సాధించి మొత్తం 14 స్థానాలనూ కైవసం చేసుకుంది. బార్డోలి ఫలితం ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే, అహ్మదాబాద్ జిల్లా పరిధిలోని ధోల్కా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బీజేపీకి మరో భారీ పరాభవం ఎదురైంది. మూడు దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీ మద్దతుదారుల ప్యానెల్ తిరుగులేని ఏకఛత్రాధిపత్యం చలాయిస్తోంది. కానీ, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన 'కిసాన్ వికాస్ ప్యానెల్' వ్యూహాత్మకంగా వ్యవహరించి పోటీ జరిగిన మొత్తం పది స్థానాలనూ గెలుచుకుని పాత వైభవాన్ని చాటింది. ఈ ఓటములు కేవలం ప్రజల అసంతృప్తిని మాత్రమే కాకుండా అధికార పార్టీ అంతర్గత రాజకీయాల్లోనూ రాజుకున్న అసమ్మతిని బయటపెట్టాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ