టాటా సియెర్రా లెజెండ్ సిరీస్‌లో ఐదు కొత్త ట్రిమ్‌లు విడుదల

Friday, September 18, 2026

and Adventure+ L automobile Five New Trims Launched in Tata Sierra Legend Series Pure L Pure L (O) Pure+ L Smart+ L technology

t f B! P L

టాటా మోటార్స్ సియెర్రా లెజెండ్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లెజెండ్ సిరీస్‌లో ఐదు కొత్త ట్రిమ్‌లు తీసుకువచ్చారు. ఇవి SUVకి ప్రత్యేకమైన స్టైలిష్ లుక్‌ను , ఆధునికతను అందిస్తాయి . SUV మార్కెట్‌లో పోటీ పెరుగుతుండడంతో టాటా మోటార్స్ వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడానికి ఈ సిరీస్‌ను తీసుకువచ్చింది. సియెర్రా లెజెండ్ సిరీస్, స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ , ఆధునిక టచ్‌తో SUV ప్రియులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. ఈ కొత్త సిరీస్‌లో ఐదు ప్రత్యేక ట్రిమ్‌లు Smart+ L, Pure L, Pure L (O), Pure+ L , Adventure+ L అందుబాటులో తీసుకువచ్చింది . ప్రతి వేరియంట్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన సౌకర్యాలు, టెక్నాలజీ , డిజైన్‌తో రూపొందించారు . ఇంజిన్ ఆప్షన్లలో 1.5L Revotron పెట్రోల్, 1.5L Hyperion TGDi టర్బో పెట్రోల్ , 1.5L Kryojet డీజిల్ ఉన్నాయి. మాన్యువల్ , ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పవర్ అవుట్‌పుట్ 106hp నుండి 160hp వరకు , మైలేజ్ 15.3 kmpl నుండి 21.26 kmpl వరకు ఉంటుంది. Smart+ L వేరియంట్ లో బేసిక్ లెదరెట్ సీట్లు, ESP, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది . Pure Lలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, TPMS, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. Pure L (O) వేరియంట్ లో పానోరమిక్ సన్‌రూఫ్, ఆటో హెడ్‌లాంప్స్, రైన్-సెన్సింగ్ వైపర్స్ వంటి ప్రీమియం ఫీచర్లు అందించారు . Pure+ Lలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, Boss Mode, USB-C ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. Adventure+ L టాప్ ట్రిమ్‌గా 360° కెమెరా, టెర్రైన్ మోడ్‌లు, డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్‌లు, అంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్ వంటి అధునాతన ఫీచర్లను అందిస్తుంది. SUV సేఫ్టీ పరంగా 5-స్టార్ Bharat NCAP రేటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, ఆల్-వీల్ డిస్క్ బ్రేకులు అందించారు.

Total Pageviews

Search This Blog

AsSencse 2

About Us

AP TO TG COMPUTER TECH

ver-1

1

Contact Form

No Thumbnail

LATEST NEWS AP TO TG
LATEST NEWS AP TO TG

#Tech

Tech

#Smartphone

Smartphone

Categories

Random Post

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ