తెలంగాణ శాసనసభ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విలేకరులతో మాట్లాడుతూ అమెరికా నుంచి వచ్చిన ఆల్ ఇండియా లీడర్ కేటీఆర్, మీడియాలో స్పష్టమైన ఆధారాలతో వస్తున్న వాస్తవ కథనాలను సైతం కృత్రిమ మేధస్సు చిత్రాలని, మార్ఫింగ్ ఫొటోలంటూ నమ్మబలుకుతూ ప్రజలను నిస్సిగ్గుగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం ఉన్న కేటీఆర్, హరీశ్ రావులకు సభా నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. చట్టసభల మర్యాదలు తెలిసి కూడా పోలీసులపై దాడికి పాల్పడటం, అనుచితంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. శాసనసభలో అత్యంత కీలకమైన 22-ఏ భూముల అక్రమాలపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో నిలబడి సమాధానం చెప్పే ధైర్యం లేకనే కేటీఆర్ చర్చ నుంచి పారిపోయారని వీరేశం ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భారీ ఎత్తున భూదోపిడీ, విధ్వంసం జరిగాయని, కేటీఆర్ మరియు ఆయన బంధువులు లాజిస్టిక్స్ పార్కుల పేరుతో వందల ఎకరాల విలువైన భూములను కబ్జా చేసి మింగేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి భూ కుంభకోణంపై తమ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ది భూదోపిడీ, విధ్వంసకర పాలన అయితే, తమ కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి అజెండా అని ఆయన చెప్పారు.
మార్ఫింగ్ ఫొటోలంటూ నమ్మబలుకుతూ ప్రజలను నిస్సిగ్గుగా తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్ : ప్రభుత్వ విప్ వేముల వీరేశం
الخميس، 10 سبتمبر 2026
Government Whip Vemula Veeresham KTR Shamelessly Misleads Public by Dismissing Evidence as 'Morphing' and 'AI Images' telangana
ليست هناك تعليقات:
إرسال تعليق