దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుండాయ్ వెన్యూ కారు స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్స్, శక్తివంతమైన పెర్ఫార్మన్స్ తో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ కాంపాక్ట్ SUV యువతరాన్ని ఆకర్షించే స్పోర్టీ లుక్‌తో పాటు, ఫ్యామిలీ యూజ్‌కి సరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉంటుంది . వెన్యూ మోడల్‌లో ఉన్న స్మార్ట్ టెక్నాలజీ, కనెక్టివిటీ ఆప్షన్స్, సేఫ్టీ ఫీచర్స్ డ్రైవింగ్ అనుభవాన్ని ఈజీ గా ఉండేలా చేస్తాయి. హ్యుండాయ్ వెన్యూ కారు ఇంజన్ ఆప్షన్స్, ట్రాన్స్‌మిషన్ వేరియంట్స్‌తో వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎంపిక చేసుకునేల అందుబాటులో ఉంది . కాంపాక్ట్ సైజ్‌కి సరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, ప్రీమియం టచ్‌తో ఈ SUV నగర డ్రైవింగ్‌కి, లాంగ్ ట్రిప్స్‌కి కూడా సరైన ఎంపికగా నిలుస్తుంది. హ్యుండాయ్ వెన్యూ కారు స్టైల్,పెర్ఫార్మన్స్, సేఫ్టీతో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ కారు స్టైలిష్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ,శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. వెన్యూ మోడల్‌లో 1.2L పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్,1.5L డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పవర్ అవుట్‌పుట్ 83 PS నుండి 120 PS వరకు , టార్క్ 113 Nm నుండి 240 Nm వరకు అందిస్తుంది . ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT ఉన్నాయి. మైలేజ్ పరంగా పెట్రోల్ వేరియంట్స్ సుమారు 17-18 kmpl,డీజిల్ వేరియంట్స్ 23-24 kmpl వరకు అందిస్తాయి. LED DRLs, క్వాడ్ బీమ్ LED హెడ్ లాంప్స్ ,డార్క్ క్రోమ్ grille, డైమండ్ కట్ అల్లోయ్ వీల్స్ తో ఆకర్షణీయంగా ఉంటుంది.ఇంటీరియర్‌లో డ్యూయల్ -టోన్ క్యాబిన్ , 12.3 ఇంచ్ కర్వ్డ్ పానోరామిక్ డిస్ప్లే లు , ambient lighting, Bose 8-స్పీకర్ సౌండ్ సిస్టం , Hyundai BlueLink కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. టెక్నాలజీ పరంగా NVIDIA ఆధారిత ccNC సిస్టమ్, OTA updates, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా Hyundai స్మార్ట్ సెన్స్ లెవెల్ 2 ADAS, 6 ఎయిర్ బ్యాగ్స్ , ESC, HAC, సరౌండ్ వ్యూ మానిటర్ , TPMS, 65+ అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.వెన్యూ కారు 3995 mm పొడవు, 1800 mm వెడల్పు, 1665 mm ఎత్తు, 2520 mm వీల్‌బేస్,45 L ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది.
0 Comments