నవంబర్‌లో అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓటర్లకు ట్రంప్‌ డివిడెండ్‌

వంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్‌ రెండు సభల్లోనూ పట్టు నిలబెట్టుకుంటే ప్రతీ అమెరికన్‌కు 5,000 డాలర్లు చొప్పున చెల్లిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దీనికి 'ట్రంప్‌ డివిడెండ్‌'గా పేరు పెడతామని చెప్పారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం డలాస్‌లో రిపబ్లికన్‌ పార్టీ నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన ట్రంప్‌ ఎన్నికల్లో తన పేరు బ్యాలెట్‌పై లేకపోయినా, తనను అభ్యర్థిగా భావించి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. ''రిపబ్లికన్లు గెలిస్తే మీరు మాతో గెలిచినట్టే. మీకు 5,000 డాలర్లు లభిస్తాయి'' అని పేర్కొన్నారు. అయితే ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి సమకూరుస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. ''మన దేశం ఎంతో డబ్బు సంపాదిస్తోంది'' అని మాత్రమే చెప్పారు. ట్రంప్‌ ప్రతిపాదన అమలు చేస్తే ప్రభుత్వంపై కనీసం 1 ట్రిలియన్‌ డాలర్ల భారం పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ హామీ ఆర్థికంగా, రాజకీయంగా ఎంతవరకు సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలి అభిప్రాయ సర్వేల్లో ట్రంప్‌ ఆమోద రేటింగ్‌ 30 శాతం దిగువన ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ధరలు, ఇరాన్‌తో యుద్ధం వంటి అంశాలపై అమెరికన్లలో అసంతృప్తి పెరుగుతోంది.

Post a Comment

0 Comments