హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న మైనర్ బాలికకు నిందితులు మత్తు పదార్థాలు ఇచ్చి, స్పృహ లేని స్థితిలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్.కి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న జర్నీ వరుణ్, నిక్కీ, నీరజ్, నిఖిల్, గణేశ్, ఆర్.వరుణ్, సంజయ్ కుమార్, చైతన్య, సి. రాజులతో సహా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను ఏ ఏ ప్రాంతాలకు తీసుకెళ్లారు? ఈ దారుణంలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
0 Comments