త్వరలో వివో వి80 ఇండియాలో లాంచ్

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో వి80 లాంచ్ డేట్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని సరికొత్త ఆరంజ్ కలర్ లో పరిచయం చేస్తోంది. ఈ ఫోన్ గత సిరీస్ కంటే మరింత పవర్ ఫుల్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతుందని వివో టీజింగ్ చేస్తోంది. వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ ఫీచర్స్ లిస్ట్ తో టీజింగ్ చేసింది. అయితే, ఈ ఫీచర్ లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. వివో వి 80 స్మార్ట్ ఫోన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ టీజర్ లో అందించిన టీజర్ ఇమేజ్ చూస్తుంటే, ఇది దాదాపు ఐఫోన్ 17 ప్రో మాదిరి డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోన్ కొత్త ఆరంజ్ కలర్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ వంటి ఫీచర్స్ కలిగి ఉండటమే ఇందుకు కారణంగా అనిపిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక ZEISS లోగో తో ట్రిపుల్ రియర్ కెమెరా మరియు LED ఫ్లాష్ ఉన్నాయి. ఈ అప్ కమింగ్ వివో ఫోన్ సినిమాటిక్ కెమెరాతో వస్తోందని వివో ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెబుతోంది. ఇదే కాదు ఈ ఫోన్ లో ప్రత్యేకమైన AI Camera ఫీచర్స్ ఉన్నాయని కూడా వివో చెబుతోంది.

Post a Comment

0 Comments