భూటాన్‌లో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపాల తీవ్రతను కొలిచే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఈ వివరాల్ని వెల్లడించింది. గ్యెల్ఫోలంగ్‌కు 3 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. ఈశాన్య భూటాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఈ భూకంపం నమోదైంది. అలాగే, సరిహద్దులో ఉన్న అసోంలోనూ కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనాలు వచ్చాయి. దీంతో అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రస్తుతానికి తీవ్ర నష్టం నమోదు కాకపోయినప్పటికీ.. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నట్లు భూటాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భూటాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం : అసోంలోనూ ప్రకంపనలు
Saturday, September 19, 2026
4.9 Magnitude Earthquake in Bhutan international national National Center for Seismology released Tremors Felt in Assam
No comments:
Post a Comment