తమిళనాడు ప్రభుత్వ బడుల్లో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ

Saturday, September 19, 2026

Chicken Biryani Once a Week in Tamil Nadu Government Schools conduct a pilot project or trial phase first national special vegetarian meal to students who prefer vegetarian food on the days

t f B! P L

మిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉండగా వెంటనే అమలు చేయకుండా ముందుగా పైలట్ ప్రాజెక్ట్, పరీక్షా దశ నిర్వహించి ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రత, సరఫరా వ్యవస్థలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని మధ్యాహ్న భోజన మెనూలో చేర్చాలనే ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. పెరుగుతున్న పిల్లలకు తగిన ప్రొటీన్లు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేసినట్లు మంత్రి తెలిపారు. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. చికెన్ బిర్యానీ ప్రతిపాదనపై మంత్రి రాజ్‌మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుళల్ జైలులో ఖైదీలకు చికెన్ బిర్యానీ అందిస్తున్నప్పుడు, దేశ భవిష్యత్తుగా భావించే పాఠశాల విద్యార్థులకు ఎందుకు అందించకూడదని ఆయన ప్రశ్నించారు. పెరుగుతున్న వయసులో పిల్లలకు ప్రొటీన్లు అవసరమని, ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని పేర్కొన్నారు. చికెన్ బిర్యానీని అందించే రోజుల్లో శాకాహారం తీసుకునే విద్యార్థులకు కూడా ప్రత్యేక వెజిటేరియన్ భోజనం అందించేలా ప్రతిపాదనను రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అంటే విద్యార్థుల ఆహార అభిరుచులకు అనుగుణంగా ఎంపిక ఉండేలా ప్రణాళిక రూపొందుతోంది. చికెన్ బిర్యానీని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేసారి ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం లేదని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ముందుగా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించి.. వంట విధానం, పరిశుభ్రత, ఆహార భద్రత, సరఫరా, లాజిస్టిక్స్ వంటి అంశాలను పరిశీలించనున్నారు. ఈ దశ విజయవంతమైతేనే విస్తృతంగా అమలు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో అందించే భోజనం నాణ్యత, పోషక విలువలను పెంచే అంశాలపై కూడా దృష్టి సారిస్తోంది. ఉదయం అల్పాహారం మెనూలో మార్పులు చేయడంతో పాటు, విద్యార్థులకు మరింత పోషకమైన ఆహారాన్ని అందించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ