రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ !
Friday, September 25, 2026
Balapur Laddu Fetches ₹39 Lakhs hyderabad Sama Praneeth Reddy from Saheb Nagar secure the 21-kilogram laddu telangana
హైదరాబాద్ లోని బాలాపూర్ గణపతి లడ్డు వేలం పాటలో రూ.39 లక్షలు పలికింది. లడ్డు వేలం పాటలో సాహెబ్ నగర్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, చంపాపేట్ కు చెందిన మర్రి రవికిరణ్ రెడ్డి, కెవిఆర్ ఫ్లవర్ మర్చంట్ కందాడ శాలిని వీరేందర్ రెడ్డి, హస్తినా పురంకు చెందిన కంచర్ల శివారెడ్డి, లండన్ నుంచి సుశి ఆండ్ కో నుంచి సామ దయానంద్ రెడ్డి, సామ వరానంద్ రెడ్డి, హస్తినా పురంకు చెందిన జిఎర్ఆర్ డెవెలపర్స్ నుంచి గడ్డం నవీన్ రెడ్డి, బాలాపూర్ నుంచి ఇబ్రాం ప్రత్యూష్ , బాలాపూర్ కు చెందిన రితున్ రెడ్డితో కలిపి 9 మంది ప్రధానంగా వేలం పాటలో పాల్గొన్నారు. రూ.1016తో ప్రారంభమై హోరాహోరీగా సాగిన పోరులో రూ.39 లక్షలకు సాహెబ్ నగర్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి 21 కిలోల లడ్డును వేలం పాటలో దక్కించుకున్నారు.
No comments:
Post a Comment