ఆసియా గేమ్స్ విజేతలకు క్యాష్ ప్రైజ్ ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
Friday, September 25, 2026
₹50 lakh each athletes Vidya Ramraj and Vishal ₹75 lakh for G. Kamalini Tamil Nadu Chief Minister Vijay Announces Cash Prizes for Asian Games Winners
ఆసియా గేమ్స్ 2026లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ భారీ క్యాష్ రివార్డ్స్ ప్రకటించారు. అథ్లెట్ల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో తమిళనాడు ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే రేసులో భారత్‌కు రజత పతకం అందించిన జట్టులోని తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లకు చెరో రూ. 50 లక్షల క్యాష్ రివార్డ్స్ అందజేస్తామని సీఎమ్‌ఓ ఎక్స్ వేదికగా వెల్లడించింది. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన 'ఎలైట్ స్పోర్ట్స్‌పర్సన్ స్కీమ్' కింద ఈ ఆర్థిక సాయం అందివ్వనుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టులోని తమిళనాడు యువ క్రీడాకారిణి జి. కమలినికి విజయ్ రూ. 75 లక్షల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment