నేపాల్ లో ల్యాండ్ అవుతుండగా ఊడిన చిన్న విమానం టైర్ : పైలట్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 13 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది
Friday, September 25, 2026
13 passengers 3 crew members safe thanks to pilot's alertness from Nepalgunj for Dolpa international Small plane loses tire while landing in Nepal
నేపాల్ లోని సీతా ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం నేపాల్‌గంజ్ నుంచి డోల్పాకు బయలుదేరింది. విమానంలో 13 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. జుఫాల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం కుడివైపు టైర్ అకస్మాత్తుగా ఊడిపోయింది.దీంతో విమానం పెద్ద కుదుపుతో రన్‌వేపైనే ఆగిపోయింది. విమానం టైర్ ఊడిపోయిన వెంటనే పైలట్ ఇంజిన్‌ను వెంటనే ఆపేశారు. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా నియంత్రించగలిగారు. విమానం రన్‌వేపైనే నిలిచిపోయినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు .విమానానికి కూడా పెద్దగా నిర్మాణపరమైన నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. టైర్ ఊడి విమానం అదుపు తప్పి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండేది. విమానం రన్‌వే పైనే నిలిచిపోవడంతో జుఫాల్ విమానాశ్రయంలో అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయానికి వస్తున్న నేపాల్ ఆర్మీకి చెందిన ఓ విమానం అత్యవసర పరిస్థితి కారణంగా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. రన్‌వేపై ఉన్న విమానాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విమానాన్ని రిపేర్ చేసేందుకు అవసరమైన సాంకేతిక నిపుణులను హెలికాప్టర్ ద్వారా తరలించారు. విమానం తొలగించిన తర్వాత రన్‌వే పై మరమ్మత్తు పనులు పూర్తి చేసి విమాన సర్వీసులను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ల్యాండింగ్ సమయంలో టైర్ ఊడిపోయి ఒక్కసారిగా ఉత్కంఠ రేపిన ఈ ఘటనలో పైలట్ అప్రమత్తతతో 16 మంది సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించింది
No comments:
Post a Comment