నేపాల్ లో ఉప్పొంగుతున్న భాగమతి నది : హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

Friday, September 25, 2026

Bagmati River Swells in Nepal Government is continuously monitoring the situation Government Issues High Alert Heavy rains are currently lashing the region international

t f B! P L

నేపాల్ లో భాగమతి నది ఉప్పొంగుతుండటంతో వరద ముంచుకొస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక నదుల్లో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా బాగమతి నదికి భారీ వరద నీరు చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీ తీరంలోని అనేక ఇండ్లను తాకుతూ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇంకొంచెం నీటి ప్రవాహం పెరిగితే, ఒడ్డున ఉన్న ప్రాంతాలను వరద ముంచెత్తే అవకాశం ఉంది. శుక్రవారం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారీ వర్షాలకు కొండ చరియలు కూడా విరిగిపడే అవకాశం ఉంది. రాజధాని ఖాట్మండ్, ఇతర ప్రాంతాలను కలిపే రహదారులపై నీరు ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లోనే వరదలు, కొండచరియల ముప్పు పొంచి ఉంది. పృథ్వి హైవే, బీపీ హైవే, కంటి లోక్‌పాత్ హైవేలు అనేక చోట్ల నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరడంతోపాటు, కొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో రహదారులు స్తంభించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోపక్క భారీ నుంచి అతి భారీవర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, రోషి నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సెప్టెంర్ 25-27 వరకు భారీ వర్షాలు పడుతాయని, వరదలు, కొండ చరియలు విరిగిపడటానికి అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ