తెలంగాణ లోని సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల 19వ తేదీన భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని ఆయన చెప్పారు.ఈ మేళాకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన ప్రాంతాల నుంచి దాదాపు 300 ప్రముఖ కంపెనీలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరై నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతతో పాటు, ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఉత్తమ్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు.
0 Comments