ఇరాన్‌లో ఆయిల్ ట్యాంకర్ పేలి 11 మంది మృతి, ఏడుగురికి గాయాలు

الأحد، 6 سبتمبر 2026

11 dead 7 Injured in Oil Tanker Explosion in Iran international Sanandaj County in Kurdistan Province with Hamedan County in Hamedan Province western Iran

t f B! P L

రాన్‌లో భారీ పేలుడు సంభవించి 11 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ ఇరాన్‌, కుర్దెస్తాన్ ప్రావిన్స్‌లోని సనందాజ్ కౌంటీని, హమేదాన్ ప్రావిన్స్‌లోని హమేదాన్ కౌంటీని కలిపే రోడ్డు మార్గంలో జరిగింది. ప్రాథమిక సమచారం ప్రకారం ఈ రోడ్డు మార్గంలో ఆయిల్ ట్యాంకర్ వెళ్తుండగా బ్రేక్స్ ఫెయిలయ్యాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్ దాని ముందున్న వాహనాలను ఢీకొంది. ఈ క్రమంలో ఆయిల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న కార్లతోపాటు, ఇతర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీ పేలుడు జరిగి, ఆ వాహనాల్లోని 11 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రుల్ని సనందాజ్‌లోని ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించారు. ఈ పేలుడు కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కూడా స్తంభించింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రేకులు ఫెయిల్ అవ్వడం కారణంగానే ఈ పేలుడు జరిగిందని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ