చైనా మార్కెట్లో హానర్ టాబ్లెట్ ప్యాడ్ X10 ప్రో మ్యాక్స్ విడుదల

الأحد، 23 أغسطس 2026

100mAh battery 13-inch display and a 10 color options: Cangshan Grey and Forest Green Honor Tablet Pad X10 Pro Max Launched in China technology

t f B! P L

చైనా మార్కెట్లో హానర్ కొత్త టాబ్లెట్ ప్యాడ్ X10 ప్రో మ్యాక్స్ లాంచ్ అయింది. 13 అంగుళాల భారీ డిస్‌ప్లేతో పాటు 10,100mAh బ్యాటరీ అందించారు. చదువుకునే విద్యార్థుల నుంచి వీడియో కాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం టాబ్లెట్ వాడేవారి వరకు ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ధరను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే, అధికారిక వెబ్‌సైట్‌లో టాబ్లెట్‌ లిస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. కాంగ్‌షాన్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభించనుంది. వై-ఫై వేరియంట్లలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 6GB + 256GB, 8GB + 256GB మోడల్స్ ఉన్నాయి. చైనాలో ఈ టాబ్లెట్ సేల్స్ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ టాబ్లెట్‌లో స్పెషల్ అట్రాక్షన్ 13 అంగుళాల భారీ డిస్‌ప్లే. సినిమాలు, ఆన్‌లైన్ క్లాసులు, స్టడీ, మల్టీటాస్కింగ్‌కు ఈ బిగ్ స్క్రీన్ అద్భుతంగా ఉంటుంది. మరోవైపు 10,100mAh బ్యాటరీ కారణంగా ఎక్కువసేపు వాడినా ఛార్జింగ్ వెంటనే దిగదు. లాంగ్ టైమ్ వస్తుంది. హానర్ స్పెషల్ ఫోకస్ కెమెరాలపైనే పెట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉండగా, ఫ్రంట్ సైడ్ 8MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు చాలా అద్భుతంగా ఉంటుంది. హానర్ ట్యాబ్ విద్యార్థుల స్టడీకి సంబంధించి అనేక ఏఐ ఫీచర్లను అందిస్తోంది. వన్-టు-వన్ స్టడీ గైడెన్స్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే భారీ డిస్‌ప్లే, బ్యాటరీతో పాటు ఏఐ ఆధారిత లెర్నింగ్ ఫీచర్లతో హానర్ ప్యాడ్ X10 ప్రో మ్యాక్స్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ