నేపాల్‌కు మళ్లీ వరద హెచ్చరికను జారీ చేశారు. భోటే కోషి నదిలో మరోమారు నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో నది నీటి మట్టం గణనీయంగా పెరుగుతోందంటూ విపత్తు నివారణ సంస్థ ఎన్.డి.ఆర్.ఆర్.ఎం.ఏ హెచ్చరికలు జారీ చేసింది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. 'భోటే కోషి నదిలో నీటి ప్రవాహం భారీగా పెరిగినట్లు శబ్దాలను గుర్తించినట్లు రసువా జిల్లా అడ్మిన్‌స్ట్రేషన్ ఆఫీస్ నుంచి సమాచారం వచ్చింది' అని ఎక్స్ పోస్టులో పేర్కొంది. రసువా, ధాండింగ్, నువాకోట్, చిత్వాన్ ప్రాంతాలు హైఅలర్ట్‌లో ఉండాలని హెచ్చరించింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మెరుపు వరదలు వచ్చిన చోట సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ జలప్రళయంలో పలుప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. కాగా, రక్షించిన బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు శనివారం ఖాట్మండుకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యాయి.
నేపాల్‌కు మళ్లీ వరద హెచ్చరిక
الأحد، 30 أغسطس 2026
Disaster Management Agency Fresh Flood Warning for Nepal international NDRRMA Water flow in the Bhote Koshi River is rising again
ليست هناك تعليقات:
إرسال تعليق