జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం, నిర్బంధం ఆరోపణల నేపథ్యంలో ఒక యువకునిపై ఆగ్రహించిన గ్రామస్తుల అతనికిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఒక బాలిక కనిపించకుండా పోయింది. మంగళవారం ఉదయం ఆమె ఆచూకీ లభించగా, సదరు యువకుడు తనను ఇంట్లో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. దీంతో సుమారు 100 నుంచి 150 మంది గ్రామస్తులు యువకుడి ఇంటిని చుట్టుముట్టారు. ఆ యువకుడి తల్లిదండ్రులను కట్టేసి దాడికి పాల్పడ్డారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ホーム
/
Villagers enraged
/
మైనర్ బాలికపై అత్యాచారం, నిర్బంధం ఆరోపణలు : ఆగ్రహించిన గ్రామస్తులు : దాడిలో నిందితుడు మృతి
الأربعاء، 5 أغسطس 2026
accused dies in attack Allegations of rape and confinement of a minor girl Jharkhand's Chatra district national Villagers enraged
ليست هناك تعليقات:
إرسال تعليق