టీం ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ బ్యాంక్ ఉద్యోగిగా అవతారమెత్తాడు. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అతడు అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఎలాగో టీం ఇండియా రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక వెళ్లింది. ఈ జట్టులో ఇషాన్‌కి లేడు. దీంతో వచ్చే నెల వరకూ అతడు ఎలాంటి క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు. దీంతో అసిస్టెంట్ మేనేజర్ హోదాలో విధులు నిర్వర్తించడానికి ఝార్ఖండ్ బ్రాంచ్‌కు వెళ్లాడు. ఫార్మల్ డ్రెస్సింగ్ ధరించి ఐడి కార్డుతో వెళ్లిన ఇషాన్.. మిగితా ఉద్యోగులతో కలిసి విధులు నిర్వర్తించాడు. బ్యాటింగ్‌లోనే కాదు.. డెస్క్ జాబ్‌లోనూ తానేం తక్కువ కాదని నిరూపించాడు. ఇషాన్ బ్యాంకుకు రాగానే తోటి ఉద్యోగులంతా అతడితో కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా క్రికెటర్ ఇషాన్ కిషన్
الأربعاء، 5 أغسطس 2026
cricket Cricketer Ishan Kishan Becomes an Assistant Manager at the Reserve Bank of India Jharkhand branch national sports
ليست هناك تعليقات:
إرسال تعليق