ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‍తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణ, ప్రజా ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి ప్రాజెక్టులతో సహా తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలకు సంబంధించిన వినతి పత్రం సమర్పించారు. ఈ భేటీలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. మరికాసేపట్లో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‍తో రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలు, కాళేశ్వరం పునరుద్ధరణ అంశం నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‍తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
الأربعاء، 5 أغسطس 2026
CM Revanth Reddy Meets Union Minister for Environment and Forests Bhupender Yadav submitted a representation regarding key issues concerning Telangana
ليست هناك تعليقات:
إرسال تعليق