జాతీయ చేనేత దినోత్సవం : నేత కార్మికులకు మద్దతుగా నిలవాలని కోరిన ప్రధాని నరేంద్ర మోడీ

Friday, August 7, 2026

national National Handloom Day PM Narendra Modi urges support for handloom weavers requested that the hashtag #NationalHandloomDay be included with every post

t f B! P L

జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు, సోషల్ మీడియా వినియోగదారులకు కీలక పిలుపునిచ్చారు. భారతీయ సాంప్రదాయ చేనేత రంగానికి దాని వెనుక ఉన్న నైపుణ్యంగల నేత కార్మికులకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత రంగులు అద్దే చేనేత కళాకారుల శ్రమను మోడీ కొనియాడారు. మన చేనేత ఉత్పత్తుల వైవిధ్యాన్ని, అందాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భారతీయ చేనేత కళల వైవిధ్యాన్ని, వైభవాన్ని ప్రోత్సహిద్దాం. మన చేనేత కళాకారులకు మద్దతుగా నిలుస్తూ ఈ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు మోదీ. ఈ సందర్భంగా ప్రధాని ఒక ఆసక్తికరమైన ఐడియాను నెటిజన్ల ముందుకు తీసుకొచ్చారు. నేటి యువత సోషల్ మీడియాలో విశేషంగా ఆదరిస్తున్న  గెట్ రెడీ విత్ మీ ట్రెండ్‌ను చేనేత ప్రచారానికి వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. మీకు ఇష్టమైన చేనేత వస్త్రాలు లేదా ఉత్పత్తులను ధరించి తయారుచేసిన  గెట్ రెడీ విత్ మీ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పంచుకోండి.ఈ వేడుకను డిజిటల్ ప్రపంచంలో పెద్ద ఎత్తున రీచ్ చేయడానికి ప్రతి పోస్టుకు #NationalHandloomDay హ్యాష్‌ట్యాగ్‌ను తప్పనిసరిగా జత చేయాలని ప్రధాని కోరారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ