హైదరాబాద్, అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుమలనగర్‌కు చెందిన నిభాష్ (25) పెట్లబుర్జులో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్న అతను, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో నిభాష్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాత్రి తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఆత్మహత్య చేసుకునే ముందు ఈ విషయాన్ని తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు. ఉదయం అతని స్నేహితులు ఇంటికి వచ్చి చూడగా, నిభాష్ విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రేమ విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
الاثنين، 31 أغسطس 2026
Amberpet police station limits AR Constable Dies by Suicide After Failed Romance crime he became deeply distressed when her family did not consent hyderabad telangana
ليست هناك تعليقات:
إرسال تعليق