ప్రకృతి విలయతాండవానికి నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. మెరుపు వరద గ్రామాలను ముంచెత్తి వందల మందిని పొట్టనబెట్టుకుంది. బురదలో కూరుకుపోయిన మృతదేహాలు. కొట్టుకుపోయిన భవనాలు, వంతెనలు ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొందరు మానవత్వం మరిచి అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. వరదలో కొట్టుకొచ్చిన మృతదేహాలపై ఉన్న నగలను ఎత్తుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో విపత్తులో చనిపోయిన ఓ మహిళ మృతదేహం కొట్టుకురాగా, ఇద్దరు యువకులు కర్రలతో ఆ శవాన్ని పైకిలేపి, చెవులకు ఉన్న కమ్మలను తీశారు. జుట్టు పట్టుకుని లాగి బలవంతంగా నగలను తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న తోటివారికి సాయం చేయకపోగా శవాలపై ఆభరణాలు కోసం ఆరాటపడటం సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది. నేపాల్ ఆకస్మిక వరదల్లో ఇప్పటి వరకు 300 మందికిపైగా మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, దాదాపు 1000 మందికిపైగా ఆచూకీ లేకుండా పోయారు. గల్లంతైనవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.
నేపాల్‌లో హృదయవిదారక దృశ్యాలు : మృతదేహాలపై ఉన్న నగలను ఎత్తుకెళ్తున్న జనం : సోషల్ మీడియాలో వీడియో వైరల్
الخميس، 27 أغسطس 2026
buildings and bridges have been swept away Heart-wrenching scenes in Nepal international People stealing jewelry from dead bodies Video goes viral on social media
ليست هناك تعليقات:
إرسال تعليق