విశాఖపట్నంలో మట్టికుప్పలో మూడు మృతదేహాలు లభ్యం

Tuesday, August 18, 2026

Andhra Pradesh crime identities of the deceased and the time of their death remain unclear Three Bodies Found in Soil Pile at Visakhapatnam's Sheela Nagar

t f B! P L

విశాఖపట్నంలోని షీలానగర్‌ జంక్షన్‌ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. లారీలోకి మట్టి ఎత్తి వేస్తుండగా మూడు మృతదేహాలు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మట్టిని లారీలోకి ఎక్కిస్తున్న సమయంలో కూలీలు మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతులు ఎవరు, ఎంతకాలం క్రితం మృతి చెందారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మట్టికుప్పను పరిశీలించి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. మృతులు ఎవరు? వారు షీలానగర్‌ ప్రాంతానికి చెందినవారా? మృతదేహాలు మట్టికుప్పలోకి ఎలా వచ్చాయి? ఎవరైనా కావాలనే అక్కడ పడేసి వెళ్లారా? లేక మరేదైనా ఘటనకు సంబంధించినవా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ